జమ్మికుంటలో అత్యాధునిక వైద్య సేవలు
KNR: జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.1.50 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య సదుపాయాలను సోమవారం కేంద్ర మంత్రి బండి సంజయ్, కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య కోసం శస్త్రచికిత్స పరికరాలు, అత్యవసర సేవల విభాగం సౌకర్యాలు, ఆధునిక డయాగ్నస్టిక్ పరికరాలు, నూతన ఉపకరణాలు ఏర్పాటు చేసినట్లు బండి సంజయ్ తెలిపారు.