వెంకటాపూర్ తండాలో ఎమ్మెల్యే పాదయాత్ర

NGKL: కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలంలోని వెంకటాపూర్ తండాలో మంగళవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సత్య, అహింస సిద్ధాంతాలను గాంధీజీ పాటించారని, ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని గౌరవించి పరిరక్షించాలి అన్నారు.