జిల్లాలో అదనంగా లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు: జేసీ

కోనసీమ: జిల్లాలో అదనంగా లక్ష టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయబోతున్నామని జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. ఇప్పటివరకు ఒక లక్ష 2వేల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. మిల్లర్లు అదనంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.