రాజమండ్రిలో ముగిసిన 'వనితా వికాసం -2026' కార్యక్రమం
E.G: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(STU) ఆధ్వర్యంలో నిర్వహించిన 'వనితా వికాసం-2026' కార్యక్రమం రాజమండ్రిలో ఆదివారం ఘనంగా ముగిసింది. జిల్లా నలుమూలల నుంచి మహిళా ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. విద్యా రంగంలో మహిళా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలపై ప్రధానంగా చర్చించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి శ్రీనివాసరావు తెలిపారు.