సహాయక చర్యల్లో ముందుండాలి: ఆడే గజేందర్

ADB: ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండి వారికి ధైర్యం కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ పేర్కొన్నారు. ఇచ్చోడ మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు శనివారం ప్రజలకు అందించిన సేవల పట్ల వారిని అభినందించారు.