దేవాదాయశాఖ ధార్మిక భవన్‌లో స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర
దేవుడికి నిలయమైన ఆలయాలు, దేవాదాయశాఖ కార్యాలయాలను స్వచ్ఛతకు మారుపేరుగా తీర్చిదిద్దాలని ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేశ్ బాబు సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఇవాళ డీసీ కార్యాలయంలో నిర్వహించారు. అధికారులు, సిబ్బంది చీపుర్లు పట్టి పరిశుభ్రం చేశారు. మొక్కలు నాటారు. స్వచ్ఛ ఆంధ్ర కోసం పాటుపడతామని రమేశ్ బాబు ప్రతిజ్ఞ చేయించారు.