హిందూ సమ్మేళనం సందర్భంగా బైక్ ర్యాలీ
SDPT: బెజ్జంకిలో హిందూ సమ్మేళనాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం బైక్ ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరామ్ నినాదాలతో గ్రామ వీధుల్లో ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. ఉత్సవ కమిటీ ఛైర్మన్, సర్పంచ్ బొల్లం శ్రీధర్ జెండా ఊపి ప్రారంభించారు. రామలక్ష్మణ జానకి జై, బోలో హనుమాన్ వంటి నినాదాలతో భక్తులు పాల్గొని గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.