VIDEO: 'ఆఫీస్ గుమ్మమే దిక్కు.. మా సమస్య తీర్చండి'

VIDEO: 'ఆఫీస్ గుమ్మమే దిక్కు.. మా సమస్య తీర్చండి'

KMM: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలాకాలోనూ రైతులకు భూ సమస్యల కష్టాలు తప్పడంలేదు. గువ్వలగూడెం గ్రామానికి చెందిన రైతు రామదాసు, భారత దంపతులు గత కొన్ని సంవత్సరాలుగా భూ సమస్యతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ నేలకొండపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో గుమ్మం తలుపుకు అడ్డంగా పడుకుని తన సమస్యను పరిష్కరించాలని నిరసన తెలిపారు.