కంకిపాడు రైతు బజార్లో ప్లాస్టిక్ బ్యాగులు నిషేధం

కృష్ణా: కంకిపాడు రైతు బజార్లో ప్లాస్టిక్ బ్యాగులు నిషేధమని ఈవో శ్రీకాంత్ తెలిపారు. శుక్రవారం ఆయన రైతు బజార్‌లోని వ్యాపారులు, రైతు బజార్ సిబ్బంది, కొనుగోలుదారులతో సమావేశం నిర్వహించారు. జ్యూట్ క్లాత్ కవర్లు మాత్రమే వాడాలని వ్యాపారులకు కొనుగోలుదారులకు సూచించారు. రైతు బజార్ నియమ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.