నృత్య ప్రదర్శనలతో మైమరపించిన కళాకారులు
సత్యసాయి: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల సందర్భంగా హిల్ వ్యూ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. కళాకారులు వివిధ వేషధారణలలో ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. సాయి పాటలకు అనుగుణంగా ప్రదర్శించిన నృత్యాలు భక్తులను ఎంతగానో మైమరపించాయి. ఈ వేడుకలను భక్తులు ఆనందోత్సాహాల మధ్య తిలకించారు.