మాదన్నపేట రహదారి దుస్థితి
WGL: నర్సంపేట మండల కేంద్రం నుంచి మాదన్నపేట గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి వర్షపు నీరుతో నిండి పోయిందని స్థానిక ప్రజలు ఆరోపించారు. అవసరాల నిమిత్తం వెళ్లే ప్రయాణికులు రోడ్డు మొత్తం బురదమయం కావడంతో ఇబ్బంది పడుతూ ప్రయాణాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను పట్టణ ప్రజలు కోరారు.