అర్ధరాత్రి వరకూ కోర్టులో ఉంటా: సీజేఐ
పేదలకు న్యాయం చేయడమే తన మొదటి ప్రయారిటీ అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. అవసరమైతే అర్ధరాత్రి వరకూ కోర్టులో కూర్చుంటానని స్పష్టం చేశారు. తిలక్ సింగ్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ కొట్టివేస్తూ.. తన కోర్టులో డబ్బున్న వాళ్ల 'లగ్జరీ వ్యాజ్యాల'కు చోటు లేదని తేల్చిచెప్పారు. మధ్యతరగతి నుంచి వచ్చిన సూర్యకాంత్ ఇటీవలే 53వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.