'రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి'

'రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి'

NDL: కోయిలకుంట్ల పట్టణంలో శనివారం లారీ బైకును ఢీకొట్టడంలో ధరణి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఎస్సై మల్లికార్జునరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.