మద్యం మత్తులో స్నేహితులు మృతి

మద్యం మత్తులో స్నేహితులు మృతి

SRD: చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన జిన్నారం PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. మేడ్చల్ జిల్లా గాగిల్లాపూర్‌కు చెందిన స్నేహితులిద్దరూ నరేష్, శంకర్ వావిలాలలో కల్లు తాగేందుకు బైక్‌‌పై వచ్చారు. తిరిగి వెళ్లే క్రమంలో ఈత కొట్టేందుకు పీర్ష చెరువులోకి దిగి మునిగిపోయారు. ప్రస్తుతం వారి మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.