వివేకానంద కాలనీలో శునకాల స్వైర విహారం
WGL: GWMC 19వ డివిజన్ పరిధి వివేకానంద కాలనీలోని పలు వీధుల్లో వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తూ.. భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. ఎక్కడ చూసినా కుక్కులే కనిపిస్తున్నాయని వాపోతున్నారు. సమస్యను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.