కొర్విచేడ్ గ్రామంలో చీకటి సమస్య.. రహదారి దారుణ స్థితి

కొర్విచేడ్ గ్రామంలో చీకటి సమస్య.. రహదారి దారుణ స్థితి

VKB: కొర్విచేడ్ గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి దారుణ స్థితిలో ఉంది. రాత్రి సమయంలో ఎక్కడా వీధి దీపాలు లేక పూర్తిగా చీకటిలోనే ప్రజలు ప్రయాణించాల్సి వస్తోంది. గుంతలు, రాళ్లతో రహదారి ప్రమాదకరంగా మారింది. మహిళలు, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేసి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.