పరిగి ఆర్టీసీ సమ్మెలో ఉద్రిక్తత

పరిగి ఆర్టీసీ సమ్మెలో ఉద్రిక్తత

VKB: పరిగిలో చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బస్సుకు అడ్డుగా పడుకుని సమ్మె చేస్తున్న కార్మికులపై డీఎస్పీ శ్రీనివాస్ ఆగ్రహంతో ఊగిపోయారు. కార్మికులను తరలించే క్రమంలో ఆయన ఓ బాలుడి దవడ పగులగొట్టారు. అదే ఊపులో ఓ కానిస్టేబుల్ చెంప చెళ్లుమనిపించారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే, డీఎస్పీ తీరుపై కార్మికులు అసహనం వ్యక్తం చేశారు.