'దివ్యాంగుల పెన్షన్లు పెంచాలి'

NLG: దివ్యాంగుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ MRPS మునుగోడు మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ముందు దివ్యాంగులు, పెన్షన్‌దారులు నిరసన తెలిపారు. తహసీల్దార్ నరేశ్‌కు వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ ఇంఛార్జ్ మేడి శంకర్ మాదిగ మాట్లాడుతూ.. వికలాంగులకు రూ.6 వేలు, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు.