VIDEO: ఫైర్ ఇంజన్ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
KDP: కమలాపురం ఫైర్ స్టేషన్‌కు నూతనంగా మంజూరైన ఆధునిక ఫైర్ ఇంజన్ వాహనాన్ని MLA చైతన్య రెడ్డి బుధవారం ప్రారంభించారు. నూతన వాహన ప్రారంభ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి శరత్ పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన సేవలు అందించేందుకు ఈ వాహనం కీలకమని ఆయన తెలిపారు. విధుల్లో అప్రమత్తంగా పనిచేస్తున్న ఫైర్ సిబ్బంది సేవలు ప్రశంసనీయమని MLA పేర్కొన్నారు.