47వ డివిజన్లో ఆర్డీవో పర్యటన

ఖమ్మం నగరంలోని మున్నేరు నది పరివాహక ప్రాంతాల్లో ఆర్డీవో నర్సింహారావు ఆదివారం పర్యటించారు. వరంగల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరుకు వరద పెరిగే అవకాశం ఉండటంతో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. MRO సైదులు, కాంగ్రెస్ నాయకులు జాకీర్ హుస్సేన్ ఈ పర్యటనలో పాల్గొన్నారు.