రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
NZB: నవీపేట్ మండలం నాగెపూర్ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌పై వెళ్తూ అదుపుతప్పి కింద పడిపోయారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ దీప్రతన్, పైలట్ రాకేష్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం బాధితులను నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.