'లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి'

'లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి'

VZM: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్‌ పి. నల్లనయ్య సూచించారు. మరో రెండు రోజల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సోమవారం పట్టణంలో పలు ప్రాంతాలను పర్యటించిన ఆయన రహదారులపై నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.