భారీ వాహనానికి జరిమానా
సూర్యాపేటలోకి నిషేధిత వేళల్లో భారీ వాహనాలు ప్రవేశించడం నేరమని ట్రాఫిక్ ఎస్సై సాయిరాం అన్నారు. ఇవాళ నిబంధనలు ఉల్లంఘించి టౌన్‌లోకి వచ్చిన ఓ లారీని విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు గమనించి రూ.1500 జరిమానా విధించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు భారీ వాహనాలను అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.