కొలింపల్లిలో వైభవంగా గంగ జాతర

కొలింపల్లిలో వైభవంగా గంగ జాతర

CTR: చౌడేపల్లి మండలం కొలింపల్లిలో గంగ జాతరను ఆదివారం కోలాహలంగా నిర్వహించారు. నడివీధిలో అమ్మవారిని ప్రతిష్టించి గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద కొబ్బరి ఆకులతో తయారుచేసిన ఆర్చి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. కాగా జాతర సందర్భంగా సందడి నెలకొంది.