VIDEO: 'హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయండి'

KMR: సదాశివనగర్ శివారులోని ఓ మూలమలుపు వద్ద రోడ్డు కోతకు గురై ప్రమాదాలు జరుగుతున్నాయి. హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో డిచ్‌పల్లీకి చెందిన ఇద్దరు ద్విచక్ర వాహనదారులు గురువారం తెల్లవారుజామున గుంతలో పడి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.