జైలులో దుప్పటి కోసం స్టార్ హీరో వినతి
కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్, హత్య కేసులో నిందితుడిగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, చలి కారణంగా నిద్రపోలేకపోతున్నానని, దుప్పటి కావాలని ఆయన కోర్టును వేడుకున్నాడు. జైలు అధికారులు తనకు దుప్పటి ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపాడు. దీంతో కోర్టు.. జైలు అధికారులపై అసహనం వ్యక్తం చేసింది. ఇంతకుముందే ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించింది.