VIDEO: వేతనాలు రావడం లేదని ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
SRPT: ఐదు నెలలుగా జీతాలు రావడం లేదని మనస్తాపం చెంది ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన సూర్యాపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. పేట ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న బచ్చలకూరి మధుసూదన్ అనే వ్యక్తి లైజాల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబ పోషణ భారంగా మారడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.