VIDEO: జగదుర్తి చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే కోట్ల

NDL: డోన్ మండలంలోని జగదుర్తి గ్రామంలో మంగళవారం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామంలోని జగదుర్తి చెరువును ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి గ్రామంలోని రైతులు వేసిన ప్రతి పంటకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.