ప్రగతి నివేదికలు సిద్ధం చేయాలి: కలెక్టర్
ప్రకాశం: ఈనెల 17, 18 తేదీల్లో జరగనున్న కలెక్టర్ల సమీక్షా సమావేశానికి అవసరమైన ప్రగతి నివేదికలను సిద్ధంచేయాలని జిల్లా కలెక్టర్ రాజబాబు అధికారులను ఆదేశించారు. నిన్న ఒంగోలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ల సమావేశానికి అవసరమైన నివేదికల గురించి జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.