నాణ్యత, మెనూ పాటించాలి: తహసీల్దార్
W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలోని ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తహసీల్దార్ కె. రాజు కిషోర్, ఎంపీడీవో సీహెచ్. త్రిశూలపాణి పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం, పూర్తి నాణ్యతా ప్రమాణాలతో భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.