రోహిత్, కోహ్లీ ఉంటే ఆ కిక్కే వేరు: తిలక్ వర్మ

రోహిత్, కోహ్లీ ఉంటే ఆ కిక్కే వేరు: తిలక్ వర్మ

టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'వన్డే, టెస్టు క్రికెట్ నా సహజమైన ఆటలా అనిపిస్తుంది. ఈ సుదీర్ఘ ఫార్మాట్లను నేను చాలా ఆస్వాదిస్తాను. రోహిత్, విరాట్ ఒకే జట్టులో ఉంటే మాలో ఆత్మవిశ్వాసం అద్భుతంగా ఉంటుంది. వారి అనుభవం నుంచి వీలైనంత నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను' అని తెలిపాడు. తన ఎదుగుదలలో వారితోపాటు కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర ఎంతో ఉందన్నాడు.