పొంగి పొర్లుతున్న కొట్టేళ్ల వాగు
GNTR: తుళ్లూరు మండలంలోని పెద్దపరిమిలో గత రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లపైకి వరద నీరు ప్రవహించింది. దీనితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొట్టేళ్ళ వాగు పొంగి రోడ్లపైకి నీరు రావడం వల్ల తుళ్లూరు లేదా గుంటూరు వైపు వెళ్లడం కష్టంగా ఉందని ఆదివారం ఉదయం స్థానికులు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.