VIDEO: జాతీయ రహదారిపై అదుపు తప్పిన కారు.. ఒకరికి తీవ్ర గాయాలు
SRPT: విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ ఇన్నోవా కారు అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో కుక్కను తప్పించే ప్రయత్నంలో నియంత్రణ కోల్పోయిన కారు చెట్ల పొదల్లోకి వేగంగా దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న డ్రైవర్‌కి స్వల్ప గాయాలు కాగా.. చికిత్స నిమ్మిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.