గ్రామ దేవత ఉత్సవాలకు మాజీ సీఎంకు ఆహ్వానం

SKLM: లావేరు మండలంలోని మురపాక పంచాయతీ గుంటుకు పేట గ్రామ దేవత ఉత్సవాలకు స్థానిక వైసీపీ నాయకులు మాజీ సీఎం జగన్‌కు ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం తాడేపల్లిగూడెంలోని ఆయన కార్యాలయ ఆవరణలో కలిసి ఆహ్వాన పత్రికను జగన్‌కు అందజేశారు. జగన్ సానుకూలంగా స్పందించినట్లు వైసీపీ నాయకులు వెల్లడించారు.