బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
GNTR: తెనాలి సుల్తానాబాదులోని సుందరయ్య నగర్‌కు చెందిన బ్లెస్సింగ్ పాల్ (9) ఇటీవల ఇంటి వద్ద ఆడుకుంటుండగా కరెంట్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. షాక్ తగిలి శరీరం కాలిపోవడంతో గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాలుడి కుటుంబానికి టీడీపీ నాయకుడు కోగంటి రోహిత్ సహకారంతో రూ.30 వేల సహాయాన్ని అందజేశారు.