రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందజేస్తాం: ఎస్పీ

NRML: జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం పదవీ విరమణ పొందిన ఎస్సై భాస్కర రావు, హెడ్ కానిస్టేబుల్ బి.గోపాల కృష్ణలను జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఘనంగా సత్కరించారు. 41 ఏళ్లు ఎస్సైగా, 42 ఏళ్లు హెడ్ కానిస్టేబుల్‌గా విశిష్ట సేవలందించిన వీరి కృషిని ఎస్పీ కొనియాడారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందజేస్తామని, వారి కుటుంబాలకు సహకారం అందిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.