సమస్యలకు నిలయంగా జాతీయ రహదారి

సమస్యలకు నిలయంగా జాతీయ రహదారి

శ్రీకాకుళం: ఎక్కడైనా జాతీయ రహదారి వచ్చిందంటే రవాణా సౌకర్యం మెరుగుపడి, రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయి. కానీ శ్రీకాకుళం నగర పరిధిలోని పెద్దపాడు ప్రాంతంలో ఈ దారి అవస్థలకు కేంద్రంగా మారుతోంది. వర్షం పడితే ఎగువ ప్రాంతాల నుంచి నీరు చేరి కిలోమీటర్ల పొడవునా నిలుస్తోంది. వాహనాల రాకపోకలు స్తంభిస్తున్నాయి. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఈ దుస్థితి నెలకొంటోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.