13న జిల్లాలో జాతీయ లోక్ అదాలత్

ప్రకాశం: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో ఈ నెల 13వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు, న్యాయవాదులు సద్విని యోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. భారతి తెలిపారు. ఈ మేరకు కేసుల పరిష్కారానికి న్యాయమూర్తులు, న్యాయవాదుల ఆధ్వర్యంలో బెంచ్‌లు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.