'వేలంపాటలో అందరూ పాల్గొనాలి'

'వేలంపాటలో అందరూ పాల్గొనాలి'

MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ పంచాయతీలో నిర్వహించే వార, దిన సంతల వేలంపాట నిర్వహించనున్నామని ఈవో రాహుల్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నిర్వహించే దిన, వారసంతల వేలంపాటను మార్చి 16న పోన్కల్ గ్రామపంచాయతీలో నిర్వహిస్తామన్నారు. వారసంతకు రూ. 20000, దిన సంతకు రూ.పదివేలు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉందన్నారు. ఆసక్తిగలవారు పాల్గొనాలని కోరారు.