'పిచ్చి కుక్కల బెడదపై తక్షణ చర్యలు తీసుకోవాలి'

'పిచ్చి కుక్కల బెడదపై తక్షణ చర్యలు తీసుకోవాలి'

నిజామాబాద్ నగరంలో పెరుగుతున్న పిచ్చి కుక్కల బెడదపై తక్షణ చర్యలు తీసుకోవాలని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ నాయకులు కోరారు. నేడు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసినట్లు వారు చెప్పారు. RSP జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ.. నగరంలో పిచ్చికుక్కల సమస్య రోజురోజుకూ తీవ్రంగా మారుతోందన్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు భయబ్రాంతులకు గురవుతున్నారు.