తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్: నారా రోహిత్

కోనసీమ: రామచంద్రపురం బైపాస్ పసలపూడి జంక్షన్ వద్ద ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని సినీ నటుడు నారా రోహిత్, మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావుడు ఎన్టీఆర్ అని రోహిత్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అని మంత్రి పేర్కొన్నారు.