చెత్తను తగలబెడితే రూ. 5 వేల జరిమానా
PDPL: చెత్తను తగలబెట్టడం నేరమని ఇందుకు రూ.5 వేల జరిమానాతో పాటు బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రామగుండం నగర ఇంఛార్జ్ కమిషనర్ జే.అరుణశ్రీ హెచ్చరించారు. చెత్తను కాల్చడం వలన పర్యావరణంపై చూపే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నేషనల్ గ్రీన్ క్రాప్స్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గూళ్ల అంజన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.