VIDEO: 'ప్రాణహితకు రూ. 52 కోట్లు కేటాయించడం తీవ్ర అన్యాయం'
ASF: అసెంబ్లీలో ఇరిగేషన్ బడ్జెట్‌పై సిర్పూర్ MLA డా. పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. ప్రాణహిత ప్రాజెక్టుకు 52 కోట్లు కేటాయించడం తీవ్ర అన్యాయమని విమర్శించారు. ఈ మొత్తం ప్రాజెక్టుకు రూ. 20వేల కోట్లు అవసరమని, కేటాయించిన నిధులు 1 శాతం కూడా కాదని, ప్రాజెక్టు పురోగతిపై సందేహాలు వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలనే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆరోపించారు.