అంగన్వాడీ కేంద్రం ఆకస్మిక తనిఖీ
SKLM: సమగ్ర శిశు అభివృద్ధి పథకం ప్రాజెక్టు అధికారిణి పెద్దింటి.అరుణ సోమవారం మందస మండలంలోని పిడిమందస అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. గర్భిణీ బాలింతల ఆహార పంపిణీ వివరాలు, సిబ్బంది హాజరు పట్టి, పిల్లల హాజరు పట్టి, ఆరు నుండి మూడు సంవత్సరాల్లో గల పిల్లల ఆహార పంపిణీ రిజిస్టర్ వివరాలు తనిఖీ చేశారు. అంగన్వా\డీ సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు.