ఉపాధి హామీ పనులు కల్పించండి

ఉపాధి హామీ పనులు కల్పించండి

అనంతపురం: నార్పల మండల కేంద్రంలో తమకు ఉపాధి హామీ పనులు కల్పించాలని పలువురు ఉపాధి కూలీలు డిమాండ్ చేస్తూ నార్పల ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గత కొద్ది రోజులుగా ఉపాధి పనులు నిర్వహించడం లేదని తమకు కుటుంబ పోషణే భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి త్వరలోనే కూలీలందరికీ ఉపాధి పనులు కల్పిస్తామని తెలిపారు.