వృద్ధుల సంక్షేమానికి మౌలిక సదుపాయాలు: ఎమ్మెల్యే
కాకినాడ: పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప బుధవారం పెద్దాపురంలో నిర్మిస్తున్న వృద్ధాశ్రమాన్ని సందర్శించి స్లాబ్ నిర్మాణ పనులు పరిశీలించారు. వృద్ధుల సంక్షేమానికి మౌలిక సదుపాయాలు కల్పించడం అత్యంత ముఖ్యమని, భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.