వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు GP చర్యలు
JGL: వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు సర్పంచ్ మలావత్ ప్రసాద్ తెలిపారు. రాయికల్ మండలంలోని దావన్పెల్లి గ్రామంలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు నిర్మించిన సిమెంటు తొట్టెల్లో మంగళవారం నీళ్లు నింపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నరేశ్, బీట్ ఆఫీసర్, గ్రామ నాయకులు పాల్గొన్నారు.