'హామీలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది'

VZM: ఎన్నికలలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆరోపించారు. శుక్రవారం "బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ" కార్యక్రమంలో భాగంగా ఆయన కొత్తవలస మండలం చీడివలస, రామలింగపురం గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించి కరపత్రాలు పంచారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడు బాబు పాల్గొన్నారు.