తండ్రి పాపాలను తేజస్వీ యాదవ్ కాపాడుతున్నారు: మోదీ
బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా RJD అగ్రనేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్‌పై ప్రధాని మోదీ విరుచుకు పడ్డారు. ఇండియా కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ తన తండ్రి లాలూ ప్రసాద్ పాపాలను దాచడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అందుకే ఆయన ఫొటోలను RJD పోస్టర్లలో మూలకు ఉంచారని తెలిపారు. రాష్ట్రంలో అత్యంత అవినీతి కుటుంబం RJD కుటుంబం అని దుయ్యబట్టారు.