రాజ్‌పల్లి పోలింగ్ బూత్‌ను సందర్శించిన ఎస్పీ
మెదక్ మండలంలోని రాజ్‌పల్లి సమస్యాత్మక పోలింగ్ బూత్‌ను జిల్లా ఎస్పీ డీవీ. శ్రీనివాస రావు సందర్శించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తగిన సూచనలు అందించారు. పోలింగ్ కేంద్రంలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విధులను నిర్వహించాలని అధికారులకు సూచించారు.